Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్‌- విశాఖ!

హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్‌ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు.

New Update
Vande Bharat Bullet Train: వందే భారత్ బుల్లెట్ రైలు.. కేంద్రం కొత్త ప్లాన్ మాములుగా లేదు!

Semi High Speed: హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్‌ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్ రైలు 8.30 గంటల సమయం తీసుకుంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంతోపాటు నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 

Also Read:  టీడీపీ ఎమ్మెల్యేలకు పవర్‌ లేదు.. ఆ రెండు ఇంకా వైసీపీ చేతుల్లోనే..?

ఇప్పుడీ ప్రతిపాదిత లైను మూడోది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 12 స్టేషన్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలో ఇదే తొలి సెమీ హైస్పీడ్ కారిడార్ కాబోతుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లు ఉంటాయి. 

Also Read:  ఫోన్‌ లిఫ్ట్‌ చేయని కలెక్టర్‌..ఎవరి పక్కాలో...అంటూ..!

సెమీ హైస్పీడ్ కారిడార్..

ఈ మార్గం ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు రైలు అన్నదే తెలియని అనేక ప్రాంతాలకు ఈ రైలు సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అది కూడా సెమీ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే చివరి దశకు చేరుకుంది. నవంబర్‌లో రైల్వే బోర్డుకు ఈ నివేదికను అందిస్తారు.

Also Read: గుస్సాడీ కనకరాజు మృతి..ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఇప్పటివరకు ఉన్న రైళ్ల గరిష్ట వేగం 110 నుంచి 130 కిలోమీటర్లకు మించి లేదు. గరిష్ట వేగంతో రైళ్లు ప్రయాణించే సందర్భాలు చాలా తక్కువుగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం రెండు రైలు మార్గాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, ఖమ్మం, విజయవాడ కాగా.. రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. 

Also Read:  ఇజ్రాయెల్‌ ప్యాంట్‌ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!

ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల్లో ప్రయాణిస్తే విశాఖకు కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. కొత్త రైల్వే కారిడార్ నిర్మాణం పూర్తైతే శంషాబాద్- విశాఖ (దువ్వాడ) మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే సెమీ హైస్పీడ్ రైలు రెట్టింపు వేగంతో నడుస్తుంది. దీంతో గమ్యస్థానాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు