Today Horoscope: నేడు ఈ రాశి వారికి తిప్పని తప్పలు.. అమ్మాయిలతో జాగ్రత్త.. లేకపోతే ఊహించని పెద్ద ప్రమాదం!

ఈ రాశి వారికి నేడు అమ్మాయిల వల్ల సమస్యలు వస్తాయి. కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం. 

New Update
Today Horoscope

Today Horoscope

మేషం

మీరు చేసే పనులలో త్వరగా విజయం లభిస్తుంది. ఇల్లు మారే లేదా ప్రయాణాలు చేసే సూచన ఉంది. శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన అవసరం వస్తుంది. 

వృషభం 
శుభకార్యాల ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులను కలుస్తారు. దీనివల్ల లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆకస్మికంగా డబ్బు లాభం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిథునం 
బంధువులు, స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. స్థిరంగా ఒక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన భయం మిమ్మల్ని వెంటాడుతుంది.

కర్కాటకం
మీ మనసుకు ఆనందం కలుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహం 
తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవచ్చు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఉద్యోగం, వృత్తిలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం కలిగి ఉండటం అన్ని విధాలుగా మంచిది. 

కన్య 
మీరు చేసే పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. బంధువులు, స్నేహితులతో విరోధం ఏర్పడవచ్చు. స్త్రీల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక విషయం బాధ కలిగిస్తుంది. పిల్లల విషయంలో పట్టుదల తగ్గించుకోండి. పగ సాధించాలనే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.

తుల
మీరు కోరుకున్నది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్య బాధలు ఉండవచ్చు. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. చంచలత్వం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనసును అదుపులో ఉంచుకోవాలి. పిల్లల పట్ల అశ్రద్ధ అస్సలు వద్దు.

వృశ్చికం
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. భూములు, ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వస్తువులు, బట్టలు, నగలు కొనుక్కుంటారు.

ధనుస్సు 
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులతో కొద్దిగా సతమతమవుతారు. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయం కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది.

మకరం
బంధువులు, స్నేహితులతో విరోధం రాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్యాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. బాగా ప్రయత్నించినా పనులు పూర్తి చేసుకోలేక పోతారు.

కుంభం
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మీరు అనుకున్న పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. కొత్త పనులను వాయిదా వేయక తప్పదు.

మీనం
కొత్త వస్తువులు, బట్టలు, వాహనాలు, నగలు లాభం పొందుతారు. ఆకస్మికంగా డబ్బు లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు