Today Horoscope: ఈ రాశుల వారికి నేడు కష్టమే.. ఏ పని తలపెట్టినా జరగడం అసాధ్యం

ఈ రోజు కొన్ని రాశుల వారికి మొత్తం నష్టమే కలగనుంది. ఏ పనిప్రారంభించినా కూడా ఆటంకాలే. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషం

మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఒక మంచి వార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభకరం.

వృషభం
మీరు చేయబోయే ముఖ్యమైన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. దైవం మీకు తోడుగా ఉంటుంది. మీ ఇష్టదేవతను పూజించడం ద్వారా మీ బలం పెరుగుతుంది.

మిథునం
ఉద్యోగం, వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు మీకు లాభిస్తాయి. కష్టమైన విషయాలలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మీదే. దుర్గా స్తుతి చదవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది.

కర్కాటకం
పట్టుదలతో పని చేస్తేనే మీరు అనుకున్నది సాధిస్తారు. మనోధైర్యాన్ని తగ్గించే విషయాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి జరుగుతుంది.

సింహం
ముఖ్యమైన పనుల్లో అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధువుల నుంచి సహాయం అందుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివితే శక్తి, విజయం లభిస్తాయి.

కన్య
ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి సమయం. కొత్త పనులు ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయి. దుర్గాధ్యానం చేయడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది.

తుల
మీరు చేసే మంచి పనులు మీకు రక్షణగా ఉంటాయి. ముఖ్య విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే లాభాలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవడం మంచిది.

వృశ్చికం
మీరు అనుకున్న ఫలితాలు రావాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. ముఖ్య నిర్ణయాలు ధైర్యంగా తీసుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. గణపతి స్తోత్రం చదవడం మంచిది.

ధనుస్సు
మీరు ప్రారంభించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. మానసికంగా బలంగా ఉంటారు. మంచి అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ ఇష్టదేవతను పూజిస్తే శక్తి, సంతోషం లభిస్తాయి.

మకరం
మీ లక్ష్యాలకు కట్టుబడి పని చేయండి. అనవసరమైన ఆలోచనలతో సమయం వృథా చేయవద్దు. కుటుంబంతో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. ప్రయాణాల్లో చిన్నచిన్న సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండండి. శివారాధన శుభకరం.

కుంభం
మీ కష్టానికి మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. పనులను పూర్తి చేయడానికి మంచి ప్రణాళిక వేసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆదిత్యహృదయం చదవడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు.

మీనం
ఉద్యోగం, వ్యాపారంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని విషయాలు బాధ కలిగించినా, ధైర్యంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. దుర్గా స్తుతి చదవడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు