Viral Video: జపాన్‌ జింక సంస్కారానికి అందరూ ఫిదా

జపాన్‌లోని ఓ జూపార్క్‌లో ఉన్న జింక అక్కడికి వచ్చిన వారికి తల వంచి నమస్కారం చేస్తోంది. ఎవరు వచ్చినా అందరికీ ఈ జింక నమస్కారం పెడుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Viral Video..1

Viral Video

Viral Video: జపాన్‌లోని జూలో ఓ జింక అందరినీ ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఎవరైనా ఎదురుపడితే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. అలాగే ఎదుటి వారు కూడా తిరిగి మనకు నమస్కారం పెడతారు. పాశ్చాత్య దేశాల్లో అయితే హగ్‌ ఇచ్చుకుంటారు. జపాన్‌, చైనా తదితర దేశాల్లో తల వంచి సగం వంగిపోయి పలుకరింపులు ఉంటాయి. జపాన్‌లోని ఓ జూపార్క్‌లో ఉన్న జింక మాత్రం అక్కడికి వచ్చిన వారికి తల వంచి నమస్కారం చేస్తోంది.

ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది:

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల దివ్య అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. డివ్స్‌గ్లామ్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే అది సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 1.2 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను చూశారు. యువతి జింకకు తలవంచి నమస్కారం పెడితే అది కూడా తిరిగి నమస్కారం పెడుతోంది.
ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

 

అలా ఎన్నిసార్లయినా చేస్తోంది. ఇది చూసిన వారంతా జింక తెలివికి, సంస్కారానికి ఫిదా అవుతున్నారు. అలా అక్కడికి ఎవరు వచ్చినా అందరికీ ఈ జింక నమస్కారం పెడుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. జపాన్‌లోని జంతువులకు కూడా మర్యాదగా ఎలా ప్రవర్తించాలో తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పలుకరించినా పట్టించుకోని వారు ఉన్న ఈ రోజుల్లో మానవుల కంటే జింకలే చాలా బెటరంటూ పోస్టులు పెడుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.


ఇది కూడా చదవండి: 
ఫౌండేషన్‌లో ఈ తప్పులు చేస్తే గ్లో అస్సలు రాదు

 

ఇది కూడా చూడండి:  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు