Kids Health: తల్లిదండ్రులు పిల్లలను ఇప్పుడే కంట్రోల్ పెట్టండి.. లేకపోతే 2050 కల్లా ఈ వ్యాధి రావడం పక్కా!

ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా మొబైల్స్, టీవీ వంటివి చూస్తున్నారు. ఇలానే చూస్తే 2050 కల్లా కంటి సమస్యలు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడే పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్‌లో పెట్టకపోతే సమస్యలు తప్పవని అంటున్నారు.

New Update
Kids Health

Kids Health

మారిన జీవనశైలి వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారు. కాస్త ఫ్రీ సమయం దొరికితే చాలు.. రీల్స్, సినిమాలు, సిరీస్, షార్ట్స్ వంటివి చూసుకుంటూ ఉంటారు. ఏదో ఒక పది నిమిషాలు చూస్తే చూశారా అంటే అదీ లేదు. గంటల తరబడి తిండి, పని మానేసి చూస్తున్నారు. తల్లిదండ్రులు వారి వర్క్‌లో బిజీగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా చూస్తున్నారు. మొబైల్ చూసుకుంటే వారి పని అవుతుందని ఎంత సమయం అయినా కూడా వదిలేస్తున్నారు. ముఖ్యంగా తినేటప్పుడు ఎక్కువ మారం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు వారు ఫుడ్ ఎలాగైనా తినాలని మొబైల్ చూపిస్తున్నారు. పిల్లలు ఇలా గంటల తరబడి మొబైల్ చూడటం వల్ల ఇప్పటికే కొందరు పిల్లలకు మెంటల్ హెల్త్, కంటి సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలానే తల్లిదండ్రులు పిల్లలను వదిలేస్తే 2050కి కల్లా కంటి సమస్యలతో పిల్లలు బాధ పడతారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. భవిష్యత్తులో వీరు కంటి చూపును కోల్పోయి.. కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొబైల్, టీవీ వంటివి ఎక్కువగా చూపించకుండా పిల్లలను పెంచాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల పిల్లలకు మసకబారిన చూపు, దగ్గరి చూపు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచే మొబైల్ చూడటం తగ్గించాలి. 

ఇది కూడా చూడండి: Calcium Benefits: మహిళలకు కాల్షియం ఎంత అవసరం..? కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చిన్న వయస్సు నుంచే కళ్లజోడు..

గతంలో ముసలివారు ఎక్కువగా కళ్లజోడు పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో చిన్న పిల్లల నుంచి యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా కళ్లజోడు పెట్టుకుంటున్నారు. అయితే ఒకప్పుడు కంటి సమస్యలతో బాధపడేవారు కళ్లజోడు పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం అయితే ఇది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. నిరంతరంగా స్క్రీన్స్ చూడటం, పోషకాలు లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ కంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా స్క్రీన్ సమయం తగ్గించాలి. అలాగే పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తోటకూర వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కీరదోసకాయ, క్యారెట్, బ్రోకలీ, నట్స్, తృణ ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కంటి సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని నిపుణులు అంటున్నారు. వీటివల్ల స్క్రీన్ చూడటం తగ్గిస్తారు. దీంతో మీకు కంటి చూపు కాస్త మెరుగుపడుతుంది. అలాగే రోజుకి సరిపడా నిద్ర కూడా పోవాలని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రలేకపోయినా కూడా సరిగ్గా చూడలేరు. కాబట్టి రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవడానికి ట్రై చేయండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: High BP And Kidney: అధిక రక్తపోటు, కిడ్నీ రోగులకు శుభవార్త.. పండ్లు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం

Advertisment
తాజా కథనాలు