Covid 19: కోవిడ్ తర్వాత.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికే డేంజర్ !

కొంతమందిలో వైరస్ నయం అయిన తర్వాత కూడా శరీరంలో బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణక్రియలో బాగాలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారు పోస్ట్ కోవిడ్ తర్వాత ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
Coronavirus disease (COVID-19)

Coronavirus disease (COVID-19)

Covid 19:  కోవిడ్-19 మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 డోసుల కరోనా వాక్సిన్ వేసుకున్నప్పటికీ  ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉన్నవారు మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు.  ఇది  శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా  వ్యక్తి ఆరోగ్యం పై  తీవ్ర ప్రభావం చూపుతుంది. కొంతమందిలో వైరస్ నయం అయిన తర్వాత కూడా శరీరంలో బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణక్రియలో బాగాలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారు పోస్ట్ కోవిడ్ తర్వాత ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.. 

శక్తినిచ్చే  ఆహారపదార్థాలు 

కోవిడ్ నయం అయిన తర్వాత శరీరానికి పోషకాలు అవసరం. ప్రోటీన్స్, విటమిన్ సి, జింక్, ఐరన్ వంటి పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలి.

ఆకు కూరలు, కాయగూరలు,  గుడ్లు, మాంసాహారం,  పళ్లలో ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉన్నవాటిని తీసుకోవాలి. అలాగే  టీలో  తేనె, అల్లం, లవంగం వేసుకొని తాగడం  వంటి ఇంటి చిట్కాలను కూడా పాటించాలి. 

వ్యాయామం,  ప్రాణాయామం

కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతి రోజు 20–30 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. నడక,  యోగా, చిన్న చిన్న వ్యాయామాలు మొదలుపెట్టాలి.

 నిద్ర 

కోవిడ్ తర్వాత చాలా మందిలో నిద్రలేమి సమస్యలు మొదలవుతాయి. కావున  రాత్రి పూట  కనీసం 7–8 గంటలు నిద్ర పట్టేలా చూసుకోవాలి.

 మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోండి

కోవిడ్ సమయంలో ఒత్తిడి, భయం అనేవి ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది . ఇప్పటికే  కొన్ని మానసిక ప్రభావాలు ఉన్నవారు మెడిటేషన్, ధ్యానం లేదా సంగీతం వినడం వంటి మార్గాలు శాంతిని కలిగిస్తాయి.

వాటర్ హైడ్రేషన్ తప్పనిసరి

రోజుకు కనీసం 2–3 లీటర్ల నీటిని తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. 

 ఆరోగ్య చెకప్‌లు 

కోవిడ్ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు బయట పడకపోవచ్చు. తద్వారా ఊపిరితిత్తుల పరీక్ష, బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ లెవల్స్ లాంటి ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకోవడం ఉత్తమం.

పొగత్రాగడం లేదా మద్యం సేవించడం

కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పొగత్రాగడం లేదా మద్యం సేవించడం పూర్తిగా మానివేయాలి.

 latest-news | life-style | covid-19 | covid 19 cases in india | Covid 19 Case Covid 19 Case Updates

#Covid 19 Case Updates #covid 19 cases in india #covid-19 #life-style #latest-news
Advertisment
Advertisment
తాజా కథనాలు