ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలానే కోరిక ఉండడం సహజం. దీని కోసం రకరకాల రకరకాల ట్రీట్మెంట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతుంటారు. అయితే ప్రస్తుతం చర్మ సౌందర్యం కోసం చేసే వివిధ ప్రక్రియల్లో ఆక్సిజన్ ఫేషియల్ ట్రెండింగ్ లో ఉంది. అసలు ఆక్సిజన్ ఫేషియల్ అంటే ఏమిటి? ఈ ప్రక్రియ వల్ల చర్మానికి కలిగే లాభాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఆక్సిజన్ ఫేసియల్ స్పాలలో సౌందర్య నిపుణులు ఉపయోగించే పాపులర్ ప్రక్రియ. ఇది చలా సురక్షితమైన ప్రక్రిగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఇంజెక్ట్స్ చేయబడవు అలాగే రసాయనాలు ఉపయోగించబడవు.ఆక్సిజన్ ఫేషియల్ చర్మానికి లోతైన హైడ్రేషన్, గ్లోను అందిస్తుంది.
Also Read: Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్
Also Read : అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు
ఆక్సిజన్ ఫేసియల్ ప్రక్రియ
ఈ ప్రక్రియ చేయడానికి ముందు మొదట చర్మం శుభ్రం చేయబడుతుంది. ఆ తర్వాత ఎక్స్‌ఫోలియేషన్ లైట్ స్ర్కబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడతాయి. ఆక్సిజన్ ఫేషియల్ ప్రక్రియలో విటమిన్లు, హైలురోనిక్ యాసిడ్ మరియు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న ప్రత్యేకంగా తయారుచేసిన సీరం చర్మంపై ఉపయోగిస్తారు. ఇది తేమను పెంచడం, మచ్చలను తేలికపరచడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఆ తర్వాత ఆక్సిజన్ స్ప్రే (ఆక్సిజన్ ఇన్ఫ్యూషన్) చేస్తారు. ఈ స్ప్రే ఆక్సిజన్ పరికరం ద్వారా చర్మంపై స్ప్రే చేయబడుతుంది. అధిక పీడనంతో సీరంతో కూడిన ఆక్సిజన్ స్ప్రే చేయడం వల్ల పోషకాలు చర్మంలోకి లోతుగా వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ 45 నిమిషాల నుండి 1 గంట వరకు పడుతుంది.
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
Also Read : అల్లు అర్జున్ బెయిల్ పై మామ రియాక్షన్.. అంతా ఫ్యాన్స్ దయ అంటూ..!