అల్లు అర్జున్ బెయిల్ పై మామ రియాక్షన్.. అంతా ఫ్యాన్స్ దయ అంటూ..!

బన్నీ బెయిల్‌పై ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చిందన్నారు. బన్నీ ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల బెయిల్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
allu arjun 2

సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బన్నీకి బెయిల్ రావడంపై ఆయన మామ, స్నేహారెడ్డి తండ్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్ర శేఖర్ రెడ్డి స్పందించారు. 

Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

‘‘ మన భారత రాజ్యంగం ప్రకారం.. జ్యుడిషియరీ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. న్యాయం అనేది 100 శాతం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల బెయిల్ వచ్చిందని నేను భావిస్తాను. ఇండియన్ జ్యుడిషియరీ అనేది చాలా న్యాయమైన జ్యుడిషియరీ. అల్లు అర్జున్‌ని అరెస్టు చేయడంతో తన కూతురు స్నేహా రెడ్డి, మనవళ్లు బాధపడ్డారు’’ అని తెలిపారు. ఇలాంటివి జరిగినపుడు ఎవరు మాత్రం బాధపడకుండా ఉంటారని అన్నారు.

రష్మిక ఏమన్నారంటే?

‘‘నేనేం చూస్తున్నానో నాకు అర్ధం కావడం లేదు. సంధ్య థియేటర్ దగ్గర జరిగినది చాలా విషాదకరమైన సంఘటన.  అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. కానీ ఆ మొత్తం ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు’’ అని అన్నారు రష్మిక. ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్నినేనసలు నమ్మలేకపోతున్నా. నాకు ఈ విషయం చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది’’ అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. 

అసలేమైంది..?

 పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు.  ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు