Autism In Kids: పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించండి ఇలా..!

ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో భాష, సామాజిక పరస్పర చర్యల్లో లోపం కనిపిస్తుంది. ఇది ముందే గుర్తించి, బిహేవియరల్, స్పీచ్, ఆక్యుపేషనల్, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ థెరపీలతో చికిత్స అందిస్తే, వారి జీవన నాణ్యత మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Autism In Kids

Autism In Kids

Autism In Kids: ఆటిజం అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక న్యూరోలాజి సంబంధిత సమస్య. ఈ సమస్య ఉన్న పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్, అందరితో కలివిడిగా ఉండే లక్షణం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందవు. ఆటిజాన్ని తొందరగా గుర్తించి, తగిన థెరపీ ద్వారా ఆటిజం పిల్లలో మంచి మార్పులు సాధ్యమవుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.

Also Read: మహిళలు థైరాయిడ్ బాధితులుగా ఎందుకు మారుతున్నారు?

ఆటిజం లక్షణాలు (Autism Symptoms)

1. ఆలస్యంగా మాట్లాడడం, భాషా అభివృద్ధిలో అంతరాయం..

ఆటిజం కలిగిన పిల్లలు సాధారణంగా ఆలస్యంగా మాట్లాడటం లేదా మాట్లాడడంలో ఇబ్బంది పడతారు. వారిని వారి పేరుతో పిలిచినా సరే  గుర్తించకపోవచ్చు, లేదా మాటల ద్వారా తాము కోరేది తెలుపలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అర్థం లేని పదాలను కూడా  మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు.

2. ఎదుటి వ్యక్తి  కళ్ళలోకి నేరుగా చూడలేకపోవడం.. 

ఈ పిల్లలు ఇతరుల కళ్ళలోకి చూడటం తగ్గిస్తారు. వారి సొంత లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇతరులతో కలవడం, సామాజిక పరస్పర చర్యలు చేయడం వారికి కష్టంగా మారుతుంది.

Also Read: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్‌

3. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం..

చేతులు ఊపడం, ఊగడం వంటి చర్యలను మళ్లీ మళ్లీ చేయడం ఈ పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాలు. ఇవి వారు గుర్తించకుండానే జరగవచ్చు.

4. ఎమోషనల్ భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోవడం.. 

ఆటిజం ఉన్న పిల్లలు ముఖ కవళికలు, శరీర భాష ద్వారా వ్యక్తమయ్యే భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో కష్టపడతారు. దీని వల్ల వారి జీవన శైలి అందరికంటే బిన్నంగా ఉంటుంది.

Also Read: వేసవిలో పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం

చిన్నపిల్లల్లో ఆటిజం ముందుగానే కనిపెట్టడం ఎలా..?

ఉదాహరణకి, 9 నెలల వయస్సులో బిడ్డ నవ్వకపోవడం లేదా తన చుట్టూ ఉన్నవారిపై ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, అవి ఆటిజం సూచనలుగా పరిగణించాలి.

చికిత్స మార్గాలు (Autism Treatment).. 

ఆటిజానికి పూర్తి చికిత్స గానీ, ఒకే రకమైన చికిత్స గానీ ఇప్పటి వరకు లేదు. అయితే, బిడ్డ యొక్క పరిస్థితిని బట్టి వివిధ థెరపీ విధానాలతో  ఉపశమనం కలిగించవచ్చు. ఇందులో ముఖ్యంగా:

  • బిహేవియరల్ థెరపీ
  • స్పీచ్ థెరపీ
  • ఆక్యుపేషనల్ థెరపీ
  • సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ 

ఈ చికిత్సలు ఆటిజం ఉన్న పిల్లల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి, వారి జీవన నాణ్యతను పెంపొందించడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

తల్లిదండ్రులకు సూచన.. 

మీ బిడ్డలో పై లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం. ప్రారంభ దశలోనే ఆటిజా లక్షణాలను గుర్తించడం, తగిన చికిత్స ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు