/rtv/media/media_files/2025/06/29/gorintaku-2025-06-29-15-51-10.jpg)
మహిళల చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు. గోరింటాకును కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి, మహిళల పసుపు, కుంకుమకి ప్రతీకగా భావిస్తారు. అయితే మహిళలు గోరింటాకును ఎప్పుడు పెట్టుకున్న కూడా ఆరోగ్యానికి మంచిదే. మిగతా రోజులతో పోలిస్తే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో మరి మీకు తెలియాలంటే తప్పకుండా ఆర్టికల్ చదవాల్సిందే.
ఇది కూడా చూడండి:Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
ఇది కూడా చూడండి:Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
రోగనిరోధక శక్తి పెరిగి..
ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడతాయి. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
అలాగే గోరింటాకు వల్ల బాడీలోని వేడి తగ్గుతుంది. అలాగే ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల తన భర్త ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇది మహిళలు సౌభాగ్యాన్ని సూచిస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు.
గోరింటాకు కొందరికి రెడ్‌గా పండదు. ఎర్రగా గోరింటాకు పండాలంటే మాత్రం నిమ్మరసం, చింత పండు అందులో వేయాలి. అలాగే గోరింటాకు పెట్టుకున్న తర్వాత నీటితో తడిమితే గోరింటాకు ఎర్రగా పండుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Ashadam Gorintaku | Gorintaku