ఈ వాటర్ డైలీ తాగితే.. జీర్ణ సమస్యలన్నీ పరార్

ఇంగువ వాటర్‌ను డైలీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వంటివి అన్ని క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వీటితో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
digestive issues

digestive issues

ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. పోషకాలు లేని పదార్థాలు తీసుకోవడం వల్ల  ఎక్కువ మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఇంగువ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

మధుమేహం వంటి సమస్యలు..

కొందరు ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంగువ వాటర్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు గుండె, శరీరంలో మంట కూడా తగ్గుతుంది. వీటితో పాటు క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ వాటర్‌ను తాగడం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, తిమ్మిర్లు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, పేగులో మంట, కడుపులో పురుగులు, ఇన్ఫెక్షన్లు అన్నింటిని కూడా తగ్గిస్తుంది. 

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

కడుపులో పేరుకుపోయిన మురికిని అంతటిని కూడా బయటకు పంపింస్తుంది. ఇంగువ ఆరోగ్యానికే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల వృద్ధాప్య సంకేతాలు, పిగ్మెంటేషన్, మొటిమలు అన్ని కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ వాటర్ డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. డైలీ తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు