Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!

మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి.

Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!
New Update

Best Pension Policy :  జీవితం విలువ తెలిసేది వృద్ధాప్యంలోనే. అందుకే వయస్సులో ఉన్నప్పుడే కాస్తంత వెనకేసుకోవాలని చెబుతుంటారు. వృద్ధాప్యంలో పనిచేయాలన్నా..శరీరం సహకరించదు.ఈ వయస్సులో ప్రశాంతంగా జీవించడం తప్పా మరొకటి ఉండదు. ప్రశాంతంగా జీవనం కొనసాగించాలంటే పెన్షన్ రూపంలో ప్రతినెలా డబ్బు అందుతుండాలి. కానీ వృద్ధాప్యంలో డబ్బు చేతిలో లేకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే...60ఏళ్లు పై బడిన తర్వాత హ్యాపీగా బతకవచ్చు. అలాంటి వారికి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి చాలా అవసరం.

అయితే పదవీ విరమణ ప్లానింగ్ కు సపోర్టు చేసే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ ఇన్వెస్ట్ మెంట్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్స్, నేషనల్ పెన్షన్ స్కీం, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే వీటితోపాటు ఎల్ఐసీ అందించే పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి. మీరు నెలకు రూ. 10వేలపైన పెన్షన్ పొందాలని భావిస్తుంటే..మీకో మంచి పాలసీ అందుబాటులో ఉంది. అదే ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్, ప్లాన్ నెంబర్ 858. ఈ స్కీంలో పెట్టుబడి ఎలా పెట్టాలి?రూ. 10వేలకు పైగా పెన్షన్ అందుకోవాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి:
ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి అనేది మీరు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే తర్వాత రెగ్యులర్ పేమెంట్స్ పొందే యాన్యుటీ ప్లాన్ ఇది. మీరు మీ కోసం లేదా మరొకరి కోసం పేమెంట్స్ అందే విధంగా ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. పాలసీ ప్రారంభించినప్పుడు మీరు పొందే మొత్తానికి హామీ కూడా ఉంటుంది. పాలసీదారులు జీవించి ఉన్నంత కాలం పేమెంట్స్ పొందుతూనే ఉంటారు. పాలసీ ప్రయోజనాలు కూడా స్థిరంగా ఉంటాయి. గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ప్లాన్ పనితీరు ఆధారంగా ఎలాంటి బోనస్ లేదా అదనపు ప్రయోజనాలు పొందలేరు. ఇది నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్టు. దీనికి డేత్, సర్వైవల్ కు చెల్లించే ప్రయోజనాలు ఫిక్స్ డ్ గా ఉంటాయి.

పాలసీ ఫీచర్లు ఎలా ఉంటాయంటే?
ఎల్ ఐసీ కొత్త జీవన్ శాంతి అనేది సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు ప్రీమియం మొత్తాన్నిముందుగా చెల్లించి తర్వాతే రెగ్యులర్ పేమెంట్స్ స్వీకరించడం ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా 2 యాన్యువల్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మొదటిది సింగిల్ లైఫ్ యాన్యుటీ. మీకోసం మాత్రమే యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు. రెండోది జాయింట్ లైఫ్ యాన్యుటీ. దీనిలో మీరు మీ కోసం మరో వ్యక్తికి యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు. యాన్యుటీ పేమెంట్స్ మోడ్ ను సెలక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవసరాల ఆధారంగా సంవత్సరానికి, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ పేమెంట్స్ కూడా ఎంచుకోవచ్చు. డెత్ బెనిఫిట్స్ ఎలా పొందాలో నిర్ణయించుకునే సదుపాయం కూడా ఉంటుంది. లంప్ సమ్ అమౌంట్, యాన్యుటీ పేమెంట్స్ రూపంలో లేదా ఇన్ స్టాల్ మెంట్స్ లో పొందవచ్చు.

ఇక రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలాగంటే?
ఈప్లాన్ తీసుకునేవారికి 30 నుంచి 79 ఏండ్ల మధ్య ఉండాలి. 1.5లక్షలు పెట్టుబడి పెట్టాలి. కొనుగోలు ధర, యాన్యుటీ లేదా ఇతర నిబంధనలపై పరిమితి ఏమీ ఉండదు. ఈ ప్లాన్ పొందే పాలసీదారుడి వయస్సు, పెట్టుబడి పెట్టే మొత్తం, వాయిదా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. 30ఏండ్ల వయస్సులో ప్లాన్ కొనుగోలు చేసి 12ఏండ్లపాటు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే..వార్షిక పెన్షన్ రూ. 1,32,920 అందుతుంది. నెలకు రూ. 10వేలకు పైగా పెన్షన్ అందుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  వార్తలు చదువుతూ స్పృహతప్పిన దూరదర్శన్ యాంకర్..ఏం జరిగిందంటే?

#lic #new-scheme #pension-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe