ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి ఏకంగా చిరుత పులి ప్రవేశించడంతో.. దాన్ని చూసి భయపడ్డ కుటుంబ సభ్యులు ఒక గదిలోనే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సుమారు 8 గంటల పాటు శ్రమించి ఆ చిరుతను పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం 10 గంటలకు కసెరుఖేడా అనే ప్రాంతంలో సమీర్ అనే వ్యక్తి ఇంట్లోకి అకస్మాత్తుగా ఓ చిరుత ప్రవేశించింది. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు, ఇద్దరు పిల్లలు ఆ చిరుతను చూసి భయాందోళన చెందారు. వెంటనే తలుపులు మూసేసి ఓ గదిలో ఉండిపోయారు. ఇక చిరుత మాత్రం ఆ గది బయటే కూర్చుంది.
Also Read: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుత అక్కడి నుంచి తప్పించుకోకుండా చూట్టూ వలలు ఏర్పాటు చేశారు. గోడను పగలగొట్టి గదిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చారు. దాదాపు 8 గంటలు శ్రమించి ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చి బంధించారు. అయితే ఆ చిరుత ఇంట్లోకి ప్రవేశించే ముందు ఓ వ్యక్తి చేయడంతో అతడు గాయపడినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Also read: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు