ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత కోసం 24 గంటల పాటు ఆపరేషన్ చేపట్టారు. గురువారం గిద్దలూరు మండలం దేవనగరంలో పులి సంచిరించింది. దీంతో నిన్న రాత్రి చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందుకోసం ఓ బోనును ఏర్పాటు చేశారు. చివరికి ఆ బోనులో చిరుత చిక్కింది.
Also Read: అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం: చంద్రబాబు
ఇదిలాఉండగా.. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. నిన్న ఒక పాడుబడిన బావిలో చిరుత చిక్కుకుంది. చుట్టూ ట్రూప్ వలలు, బోనులు ఏర్పాటు చేశారు. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: చంద్రబాబు ముందు పెను సవాళ్లు!