Hyderabad : మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం శంషాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్‌పోర్టు రన్‌వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది. By Manogna alamuru 02 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Shamshabad Air Port : శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత(Leopard) పెద్ద సమస్యగా తయారయింది. ఐదు రోజులుగా అక్కడే తిరుగుతోంది కానీ పట్టుకుందామంటే చిక్కడం లేదు. ఈరోజు రన్‌వే సమీపంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాలకు మళ్ళింది చిక్కింది చిరుత. 6 రోజుల క్రితం కూడా ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైనే కనిపించింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకుందామని ఎయిర్ పోటర్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆపరేషన్ చిరుత(Operation Cheetah) పేరుతో ప్రత్యేక బృందాలు కూడా వచ్చాయి. అయినా కూడా 6 రోజుల నుంచి చిక్కకుండా అధికారులకు ముప్పు తిప్పలు పెడుతోంది. బోన్లు..ట్రాప్‌లు, ప్రత్యేక బృందాలు.. చిరుతను బంధించేందుకు రోజురోజుకూ అటవీశాఖాధికారులు బోన్ల సంఖ్యను పెంచుకుంటే వెళుతున్నారు. ఆరు రోజులుగా చిరుత ఎయిర్ పోర్ట్ సిబ్బందికి , ప్రత్యేక బృందాలకు చిక్కడమే లేదు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం తప్పించుకుంటోంది. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు చిరుతను పట్టుకోవడానికి బోనులో మేకను ఎరగా కూడా వేశారు. అయితే అది మాత్రం చాలా తెలివిగా బోను వరకు వస్తోంది కానీ అందులోకి దూరడం లేదు. మేకను చూసి కూడా లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో తిరుగుతోంది కానీ ట్రాప్‌కు మాత్రం దొరకడం లేదు. చెట్లలో దాక్కుని... ఎయిర్‌పోర్టు పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కుని ఉందని అటవీశాఖ ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి. చిరుతను బంధించేందుకు 5 బృందాలుగా అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరా విజువల్స్(Trap Camera Visuals) ఆధారంగా పులి సంచరిస్తున్న 2 ప్లేసులు గుర్తించారు.ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో నిఘా వేశారు. దాని బట్టి ఇవాళ కచ్చితంగా చిరుతను పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. Also Read:Congress: అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని సస్పెన్స్ #hyderabad #leopard #air-port #runway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి