movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది.

New Update
movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

మరో రెండు రోజుల్లో లారెన్స్, కంగనా నటించిన చంద్రముఖి 2 సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ వేంకటపతి రాజుని వేటయ్యాన్ కలిశాడు. అంటే లారెన్స్ , రజినీకాంత్ ని మీట్ అయ్యాడు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రీసెంట్ గా రజినీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు లారెన్స్ శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతో పాటూ తన చంద్రముఖి మూవీ విడుదలకు రెడీ అవ్వడంతో రజినీకాంత్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నానని చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చంద్రముఖి 2 రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కంగరనౌత్, లారెన్స్ హైదరాబాద్ వచ్చి, పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సీక్వెన్స్ మూవీలో అప్పుడు, రజినీకాంత్ నటించిన పాత్రలో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నారు. అప్పుడు చంద్రముఖిగా జ్యోతిక భయపెట్టింది. ఇప్పుడు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భయపెట్టడానికి రెడీ అయ్యింది.

నిజానికి ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ, మేకర్స్ మూవీ విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు, ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చంద్రముఖి 2 కి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్

Advertisment
తాజా కథనాలు