Laureus Sports Awards : లారస్ స్పోర్ట్స్‌ అవార్డుల విజేతలు వీళ్లే..

క్రీడారంగాల్లో విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్‌ అవార్డులు దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో లారస్ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు ఆటగాళ్లకు ఈ అవార్డులతో సత్కరించారు.

Laureus Sports Awards : లారస్ స్పోర్ట్స్‌ అవార్డుల విజేతలు వీళ్లే..
New Update

Winners : క్రీడారంగాల్లో(Sports Field) విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్‌ అవార్డులు(Larus Sports Awards) దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో లారస్ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ టెన్నీస్ ఆటగాడైన నోవాక్‌ జొకోవిచ్‌(Novak Djokovic) ఐదోసారి లారస్ వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. సెర్బియాకు చెందిన నోవాక్‌.. గతంలో 1012, 2015, 2016,2019లో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది కూడా దీన్ని దక్కించుకున్నారు.

Also read: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..

మరోవైపు స్పెయిన్‌(Spain) కు చెందిన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ విజేత అయిటానా బొన్‌మాటి కూడా వరల్డ్‌ స్పోర్ట్స్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును సాధించాడు. అలాగే ఫిఫా వరల్డ్‌ కప్‌ విజేత అయిన స్పెయిన్‌కు చెందిన జట్టుకు లారెస్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. అవార్డుల సాధించిన వారి వివరాలు ఇవే.

లారస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: నోవాక్ జకోవిచ్
లారస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: ఐతానా బొన్మత్
లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు
లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు: జూడ్ బెల్లింగ్‌హామ్
లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: సిమోన్ బైల్స్
లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డ్: ఫండసీన్ రాఫా నాదల్
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ విత్ ఎ డిసేబిలిటీ అవార్డు: డైడ్ డి గ్రూట్
లారెస్ వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: అరిసా ట్రూ

Also read: ప్రిన్స్ తో ప్యాట్ కమ్మిన్స్‌.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

#telugu-news #football #sports-news #novak-djokovic #laureus-sports-awards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe