Pat Cummins: ప్రిన్స్ తో ప్యాట్ కమ్మిన్స్‌.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు, SRH కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒకేచోట సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ఓ యాడ్ లో నటిస్తున్నట్లు తెలుస్తుండగా ఒకరినొకరు ప్రేమగా పట్టుకుని ఫొటోలు ఫోజులిచ్చారు. పోస్ట్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
Pat Cummins: ప్రిన్స్ తో ప్యాట్ కమ్మిన్స్‌.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

Pat Cummins Met Mahesh Babu: ఆస్ట్రేలియా అండ్ SRH కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌ కమ్మిన్స్‌.. ప్రిన్స్ తో కలిసి ఒకేచోట సందడి చేశారు. ఈ మేరకు ఓ యాడ్ షూట్‌లో భాగంగా వీరిద్దరూ కలిసినట్లు తెలుస్తుండగా.. సూపర్ స్టార్ ను కలిసినందుకు హ్యాపీగా ఉందంటూ కమ్మిన్స్ నెట్టింట షేర్ చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మాధవీలతకు ఆలింగనం.. ఏఎస్సై కి షాక్ ఇచ్చిన సీపీ!

ఈ మధ్యాహ్నం సరదాగా..
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్న కమ్మిన్స్.. ‘టాలీవుడ్ ప్రిన్స్‌తో ఈ మధ్యాహ్నం సరదాగా గడిపాం’ అంటూ అతనిపై ప్రేమగా చేతులేసి దిగిన ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. హైదరాబాద్ టీమ్ ఫ్యాన్స్, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇద్దరూ ఒకే హైట్, కలర్ ఉండటంతో అన్నదమ్ముల్లా ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. అలాగే మరికొంతమంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సైతం మహేష్ తో ఫొటోలకు ఫోజులిచ్చారు.

#pat-cummins #mahesh-babu #srh #ipl-2024
Advertisment
Advertisment
తాజా కథనాలు