Moto G04: మోటొరోలా నుంచి సరికొత్త ఫోన్...ధర రూ. 10వేలే...ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!!

మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కు సంబంధించిన టీజర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో విడుదలైంది.

Moto G04: మోటొరోలా నుంచి సరికొత్త ఫోన్...ధర రూ. 10వేలే...ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!!
New Update

Motorola Moto G04: మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఎల్లుండి మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా శుక్రవారం వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కు సంబంధించిన టీజర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో (Flipkart) విడుదలైంది.మోటొరోలా జీ04కి 90Hz రిఫ్రెష్ రేట్, Unisoc T606 ప్రాసెసర్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడా వస్తుంది. నాలుగు కలర్ ఆప్షన్లలో ఫోన్ లాంచ్ అవుతుందని కూడా పోస్ట్‌లో సూచించింది.ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ఇ-కామర్స్ సైట్‌లో ప్రత్యేక ల్యాండింగ్ పేజీ కూడా క్రియేట్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ల గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇవి స్పెసిఫికేషన్‌లు:

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSలో నడుస్తుందని.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనికి 4జీబీ + 64జీబీ 8జీబీ + 128జీబీ అనే రెండు ఎంపికలు కూడా ఉన్నాయి. ఇది వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు.ఫోటోగ్రఫీ కోసం, మోటొ జీ04 వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 16మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. అదనంగా, ఇది 10వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. బ్యాటరీకి సంబంధించి, పాటలను 102 గంటల పాటు ప్లే చేయవచ్చు. డాల్బీ అట్మాస్ మెరుగుపరచబడిన స్పీకర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

Motorola Moto G04 Motorola Moto G04

మోటొరోలా జీ04 ఇప్పటికే ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఐరోపాలో దీని ప్రారంభ ధర EUR 119 (సుమారు రూ. 10,600) వద్ద ఉంది. ఈ ధరలోనే ఈ ఫోన్‌ను భారతదేశంలో కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!!

#technology-news #motorola #motorola-moto-g04 #5g-smartphone
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe