🔴 LIVE BREAKINGS: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 06, 2025 11:24 IST

    అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

    నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది.

    VRL Logistics
    VRL Logistics Photograph: (VRL Logistics )

     



  • Feb 06, 2025 09:05 IST

    ఒరేయ్ నీచుడా.. ఎంత పనిచేశావ్ రా.. భార్య విడాకులు అడిగిందని ఇన్స్టాగ్రామ్లో

    అహ్మదాబాద్‌లోని మేమ్‌నగర్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు అడిగిందని ఆమె భర్త  తన భార్య ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు.

    Husband Allegedly Leaks Wife's Private Photos
    Husband Allegedly Leaks Wife's Private Photos

     



  • Feb 06, 2025 09:04 IST

    వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం

    మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాద ఘటన జరిగింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న ఇంటి పక్కన ఉన్న గార్డెన్‌లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. 



  • Feb 06, 2025 09:04 IST

    శ్మశానవాటికలో బీజేపీ లీడర్.. బిచ్చం ఎత్తుకునే వరకు తీసుకొచ్చిన రాజకీయాలు

    పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సిన్హా ఇప్పుడు బీర్భూమ్ జిల్లాలోని తారాపిత్ శ్మశానవాటికలో భిక్షాటన చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    indrajit sinha
    indrajit sinha

     



  • Feb 06, 2025 09:03 IST

    బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి..

    బంగారం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. నేడు మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,060గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

    Gold rates today
    Gold rates today

     



  • Feb 06, 2025 09:01 IST

    ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్‌ వాడితే.. చివరికి

    కర్ణాటకలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సు కుట్లుకు బదులు ఫెవిక్విక్ వాడింది. ఏడేళ్ల బాబు చెంపకు గాయం కాగా ప్రభుత్వం హాస్సిటల్‌కు తీసుకెళ్తే.. నర్సు కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో చర్మాన్ని అతికించింది. విషయం బయటకు తెలయడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

    Nurse Uses Fevikwik
    Nurse Uses Fevikwik Photograph: (Nurse Uses Fevikwik)

     



Advertisment
తాజా కథనాలు