Latest Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్‌!

NIACL అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 300 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

New Update
Latest Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్‌!

NIACL Assistant Recruitment : న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(New India Insurance Company Limited) 300 అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్(Assistant Recruitment) జరుపుతోంది. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు(Online Applications) ఫిబ్రవరి 1(రేపటి) నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం ఫిబ్రవరి 15, 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను మార్చి 2, 2024న నిర్వహిస్తారు. మొత్తం 300 పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 149, ఈడబ్ల్యూఎస్‌కు 30, ఓబీసీకి 10, షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు 68, షెడ్యూల్డ్ ట్రైబ్‌కు 43 పోస్టులు ఉంటాయి.

NIACL Assistant Recruitment 2024-Click Here To Download Notification PDF

దరఖాస్తు రుసుము:
జనరల్, OBC, EWS వర్గాలకు దరఖాస్తు రుసుము రూ. 850గా నిర్ణయించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, PWD కోసం దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఈ జాబ్‌ అప్లై చేయడానికి కనిష్టంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు:
--> ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
--> దీని తర్వాత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
--> వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సమర్పించండి.
--> ఫారమ్‌ను పూరించండి మరియు సమర్పించండి.
--> ఆ తర్వాత ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసి, మీ వద్ద ఉంచుకోండి.

Also Read: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

WATCH:

Advertisment
తాజా కథనాలు