Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు!

బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
New Update

Bapatla : ఏపీ (AP) లోని బాపట్ల జిల్లా అద్దంకి  రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి (Tirupati) నుంచి హైదరాబాద్‌ (Hyderabad) వెళ్తున్న టీజీఎస్ర్టీసీ బస్సు (TGSRTC BUS) బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి సమయం కావడంతో సాయం చేసేందుకు ఎవరూ లేరు. అటు వెళ్తుగా ప్రైవేట్‌ వాహనాల వారు పోలీసులకు సమాచారం అందించగా..వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మలుపులు వద్ద ఏర్పాటు చేసిన రేడియం స్టిక్కర్‌ డ్రమ్స్‌ కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బస్సులోని మిగతా ప్రయాణికులను వేరే బస్సుల ద్వారా గమ్య స్థానాలకు అధికారులు తరలించారు.

ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Also Read: విరాళంగా రూ. 4 వేలు..జైలు శిక్ష 12 ఏళ్లు!

#road-accident #ap #bapatla-district #tgsrtc-bus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe