Hyderabad : మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు

ఈ రోజు ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

New Update
Hyderabad : మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు

Malla Reddy : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) గవర్నమెంట్ ప్రజాపాలన పేరుతో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష స్పందన లిభిస్తోంది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయం, అవినీతికి సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. మంగళవారం, శుక్రవారం సచివాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి(Prajavani) కి వేల సంఖ్యలో హాజరవుతున్న జనాలు.. తమ అర్హతలకు అందాల్సిన లబ్దితోపాటు భూ అక్రమణలపై కూడా రేవంత్(CM Revanth) సర్కార్ కు గోడు విన్నవించుకుంటున్నారు.

ఇప్పుడైనా న్యాయం చేయండి..
ఈ క్రమంలోనే నేడు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బాధితులు.. ప్రజావాణిలో మల్లారెడ్డిపై(Malla Reddy) ఫిర్యాదులు చేశారు. మంత్రి మల్లారెడ్డి తమ భూములు కాజేశారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆరోపణలు చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డంపెట్టకుని బెదిరింపులకు పాల్పడ్డారని, గతంలోనూ దీనిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, రెవిన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతులు ఇస్తున్నారు.

మల్లారెడ్డి బామ్మర్ది బెదిరిస్తున్నాడు..
మా దగ్గర అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి. రిజిస్టర్ నెంబర్లు ఉన్నాయి. భూమి దగ్గరకు వెళ్తే గుండాలతో బెదిరిస్తున్నారు. మల్లారెడ్డి అతని బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి మాపై దాడులకు పాల్పడుతున్నారు. 1996లో కొన్న భూమిని దొంగ డాక్యూమెంట్స్ సృష్టించి 365 కుటుంబాలను రోడ్డుమీదకు తీసుకొచ్చారు. గతంలోనూ కొన్నేళ్లుగా తిరిగి తిరిగి కాళ్లు అరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎఫ్ ఐఆర్ ఫైల్ చేసినా ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. పొద్దంతా స్టేషన్ లోనే కూర్చోబెట్టి సాయంత్రం ఇంటికి పంపిస్తారు. మల్లారెడ్డి బామ్మర్ది డైరెక్టుగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గుండ్ల పోచంపల్లిలో పలు సర్వే నెంబర్లలతో భూమి కబ్జా చేశారు. దాదాపు 700 మందిలో 150 మందిని డబ్బుతో కోనేసి, బెదిరించి తనవైపు మాట్లాడించుకుంటున్నాడని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : CRIME: కరీంనగర్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిని కత్తితో పొడిచి

రేవంత్ కు కూడా తెలుసు..
ఇప్పటికైనా సీఎం రేవంత్ మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ప్రజావాణికి వచ్చామని బాధితులు చెబుతున్నారు. ఆయన దుర్మార్గం గురించి రేవంత్ కు మొత్తం తెలుసని, తప్పకుండా బాధితులకు అండగా నిలబడతారని కోరుతున్నాం. ఒకవేళ ఈసారి కూడా మాకు న్యాయం జరగగపోతే అక్కడే ప్రాణాలు విడుస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. 30 ఏళ్ల కిందట భూ ఆక్రమణలకు పాల్పడుతున్న మల్లారెడ్డి ఇప్పటి వరకూ వందల ఎకరాలను కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు. 150 ఫ్లాట్ లను కబ్జా చేసి గుండాలతో బెదిరిస్తున్నాడు. అక్కడే గుండాలకు రూములు వేయించి కాపాల పెట్టాడు. మాకు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పోలీసులు కేసు పెట్టిన ప్రయోజనం లేదు. పోలీసులే ఆయన పోలిటికల్ సపోర్టు ఉందని, మమ్మల్నే కామప్రమైస్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు నచ్చిన రేట్లకే భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాడని ఆరోపిస్తున్నారు.

రేవంత్ సర్కార్ తప్పకుండా తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రజలకు అండగా నిలబడతానని మాటిచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తప్పకుండా సమస్యను పరిష్కరిస్తారని, వీలైనంత త్వరగా దాదాపు 600 మందిని మల్లారెడ్డి గుండాల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు