UK : విద్యార్థులకు(Students) లెక్కలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు(Maths Teacher) తానే లెక్క తప్పింది. విద్యా బుద్ధులు నేర్పించి, ఉన్నత విలువలు గల సమాజాన్ని నిర్మించాల్సిన లేడీ టీచర్ కామ కోరికలతో తన విద్యార్థులను తప్పిదారి పట్టించింది. శృంగార వాంఛతో స్కూల్ బాలురపైనే కన్నేసి లైంగిక కోరికలు తీర్చుకుంది. అయితే ఒకరితోనే సరిపెట్టుకోకుండా పలువురు బాలురతో సన్నిహితంగా ఉండగా.. చివరకు గర్భం దాల్చడతో కథ అడ్డం తిరిగింది. దీంతో వివాదాస్పమైన ఇష్యూ కోర్టు వరకూ వెళ్లగా జైలుపాలైన లేడీ టీచర్.. బెయిల్ పై బయటకొచ్చి మరోసారి తన బుద్ది మార్చుకోకుండా మరో దారుణానికి పాల్పడింది. సమాజం సిగ్గుపడే ఘటన బ్రిటన్ లో ఆలస్యంగా వెలుగులోకి రాగా వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్..
ఈ మేరకు బ్రిటన్(Britain) కు చెందిన రెబక్కా జాయ్‌నెస్ (30) అనే లేడీ టీచర్.. 2021లో ఓ బాలుడికి ట్యూషన్ చెప్పింది. ఇందులో భాగంగానే ఇద్దరి మధ్య సంబంధాలు మరింత క్లోజ్ అవగా.. 11 అంకెల ఫోన్ నెంబర్లో ఒక్కటి తక్కువ చెప్పి కనుక్కోవాలని ఛాలెంజ్ విసిరింది. అలా బంధం మరింత బలపడగా.. బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన ఖరీదైన బెల్ట్, వస్తువులు కొనిచ్చింది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి లైంగిక కోరికలు(Sexual Desires) తీర్చుకుంది. ఈ విషయం విద్యార్థి తన మిత్రుతో చెప్పగా పోలీసులకు చేరింది. దీంతో వెంటనే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన పోలీసులు.. జాయ్‌నెస్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Breaking: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీకాంతాచారి తల్లి!
ఇక్కడవరకూ ఇలావుంటే.. బెయిల్ పై బయటకొచ్చిన ఆమె.. మరో బాలుడితో రిలేషన్ మొదలుపెట్టింది. స్నాప్ ఛాట్(Snap Chat) లో పరిచయమైన అతడికి తన ఫొటోలు పంపి లొంగదీసుకుని కోరికలు తీర్చుకుంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతే తాను లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు చెబుతోంది.