తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కురియన్ కమిటీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో కురియన్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో నాయకులందరూ తమ అభిప్రాయాలు వివరించారు.
Also read: హైదరాబాద్‌లో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష!
దీంతో కురియన్ కమిటీ ముందుకు సంచలన అంశాలు వచ్చాయి. ఎందుకు ఓడిపోయానే విషయాలు కమిటీకి కాంగ్రెస్ నేతలు తెలియజేయడంతో మరోసారి హస్తం పార్టీ నేతల కలహాలు బయటపడ్డాయి. స్థానిక నాయకత్వం సహకరించలేదని పలువురు నేతలు ఫిర్యాదు చేయగా.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలపై ఉన్న వ్యతిరేకతతో ఓడిపోయామని మరికొందరు అన్నారు. ఇక బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయ్యిందని ఇంకొందరు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఓటమికి స్థానిక ఎమ్మెల్యేలే కారణమని వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశీచందర్ రెడ్డే తమను కలుపుకొని పోలేదన ఎమ్మెల్యేలు చెప్పారు. ఇక MIMతో కాంగ్రెస్ దోస్తి దెబ్బతిసిందని ఫిరోజ్‌ఖాన్ అన్నారు. 14 సీట్లు గెలవాలన్న రాహల్ గాంధీ టార్గెట్ రీచ్ కాకపోవడానికి ఎంఐఎం కారణమని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో అసద్ వర్సెస్ బీజేపీగా పోటీ జరిగిందని ఫిరోజ్‌ఖాన్ వివరించారు.
Also Read: మోదీ క్యాబినెట్‌లో అవకాశం రానివాళ్లంతా అసమర్థులేనా.. RTVతో డా.కే లక్ష్మణ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!