Dr Laxman: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్ ఆర్టీవీకి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధించడం దేశానికి గొప్ప శుభసూచకమన్నారు. అలాగే క్యాబినేట్ లో చోటు దక్కకపోవడంపై మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను శిరోధార్యంగా భావించి కష్టపడి పనిచేయడమే తనకు తెలుసని చెప్పారు. సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి ఈ స్థాయికి చేరినందుకు చాలా సంతృప్తిగానే ఉందన్నారు. మోదీ తనపై అపారమైన నమ్మకం ఉంచారని చెప్పారు. అయితే మోదీ క్యాబినేట్ లో చోటు దక్కకపోవడం అసమర్థత కాదని, ఏ ప్రభుత్వంలోనైనా అందరికీ అవకాశాలు రావని చెప్పారు. మోదీ హయాంలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే విషయంపై కూడా ఓపెన్ అయ్యారు.
పూర్తిగా చదవండి..BJP: మోదీ క్యాబినెట్‌లో అవకాశం రానివాళ్లంతా అసమర్థులేనా.. RTVతో డా.కే లక్ష్మణ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కని వారంతా అసమర్థులేనా? బీజేపీ రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు తొలగించబోతుందా? అయోధ్యలో బీజేపీ ఓటమికి అదే కారణమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నది నిజమేనా? RTVతో సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మణ్!
Translate this News: