CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది... కూనంనేని సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం ఉండొద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అమ్ముడుపోయిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాలేదని వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడుతుంటే హరీష్ కోపం వస్తుందన్నారు,

CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది... కూనంనేని సంచలన వ్యాఖ్యలు!
New Update
Kunamneni Sambasiva Rao:తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై జరుగుతున్న ధన్యవాదాలు తెలిపె తీర్మానంలో తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయని కూనంనేని సాంబశివరావు అన్నారు. నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషనకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని సభ్యులను కోరారు. అనంతరం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేలా చూడాలని స్పీకర్ ను కోరారు. గత ప్రభుత్వంలో 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని.. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని పేర్కొన్నారు.
గత పదేళ్లు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు చాలా చూశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వాళ్లు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో ఎంతమంది హౌస్‌ అరెస్ట్ అయ్యారో లెక్కలు బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి బీఆర్‌ఎస్‌ తప్పు చేసిందని పేర్కొన్నారు. దీంతో నెగిటివ్‌ వచ్చి స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటే హరీశ్‌రావుకు (Harish Rao) కోపం వస్తుందని అన్నారు. 3 ఎకరాల భూమి ఇచ్చారా?, ఇళ్లు ఇచ్చారా?.. సదుద్దేశంతో చెబితే హరీశ్‌రావు వినడం లేదని పేర్కొన్నారు.

సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయని కూనంనేని సాంబశివరావు అన్నారు.నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషనకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని సభ్యులను కోరారు. అనంతరం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేలా చూడాలని స్పీకర్ ను కోరారు. గత ప్రభుత్వంలో 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని.. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందని పేర్కొన్నారు.

ALSO READ:  మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు

#kcr #cm-revanth-reddy #brs-party #telangana-assembly-session #kunamneni-sambasiva-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe