KTR: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో (Delhi Liquor Scam) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) గురువారం రాత్రి అరెస్ట్ కావడంతో బీఆర్‌ఎస్(BRS) నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ట్విటర్ (Twitter) వేదికగా స్పందించారు. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను అణచివేయడం కోసం బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవితను(Kavitha) కూడా ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ తో పాటు కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్ వాదీ పార్టీతో విపక్ష పార్టీలు ఈడీ చర్యను వ్యతిరేకించాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయిన తరువాత కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడడం రాజకీయ కక్షే అని ఆరోపించాయి.
ఢిల్లీ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆప్ పార్టీ తన బలాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో కేంద్రం ఇలా కక్షపూరితంగా వ్యవహారిస్తోందని నేతలు బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి!