KTR Attacked With Stones in Bhainsa: నిన్న (గురువారం) నిర్మల్ జిల్లా భైంసాలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించగా.. కొందరు ఆయనపై రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడి కేసులో బీజేపీ (BJP), హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేశారు. మరో 15 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అందులో 17 మంది హనుమాన్ స్వాములు, మిగిలినవారు సివిలియన్స్ ఉన్నారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also read: దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..
శాంతి భద్రతల విషయంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడింతే సహించేది లేదని.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించాకు. ప్రస్తుతం భైంసా ప్రశాంతంగా ఉందని.. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.
Also Read: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు!