Chandrababu : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అరెస్టు ఇష్యూలో కేటీఆర్ కీలక బాధ్యతలు వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కవిత ఇంట్లోకి వచ్చిన ఈడీతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్.. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ తనదైన స్టైల్ లో ఈడీ అధికారులతో వాదించారు. అంతేకాదు కవిత వెనకాలే ఢిల్లీ బయల్దేరి వెళ్లిన కేటీఆర్.. సోషల్ మీడియా(Social Media) వేదికగా ఈడీ, బీజేపీలపై సంచలన ట్విట్స్ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును(Chandrababu) గుర్తు చేసుకుంటూ గతంలో చంద్రబాబు చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేశారు కేటీఆర్(KTR).
బీజేపీ దుర్వినియోగం చేస్తోంది..
ఈ మేరకు ఫిబ్రవరి-15న 2019లో '2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబ సభ్యులను బలిపశువులను చేయడానికి CBI & ED వంటి సంస్థలను బీజేపీ(BJP) దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ ప్రతీకారానికి బీజేపీ ఎంత దిగజారిపోతుందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ఈ దాడులు ఇప్పుడు ఎందుకనేది ప్రశ్నార్థకం?' అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : Breaking : ఈడీ ఆఫీసులోనే కవితకు వైద్య పరీక్షలు పూర్తి చేయించిన అధికారులు!
బీజేపీ కక్ష సాధిస్తోంది..
అయితే అదే ట్వీట్ ను కేటీఆర్(KTR) మళ్లీ పోస్ట్ చేస్తూ.. 'చూశారు కదా బీజేపీ పరిస్థితిని చంద్రబాబు చక్కగా చెప్పారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదు' అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్ లో ‘బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధిస్తోంది. కేసు కోర్టు పరిధిలో ఉన్నా ఈడీ నిబంధనలు పాటించలేదు. న్యాయపరంగా పోరాడుతాం. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది' అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైలర్ అవుతుండగా టీడీపీ శ్రేణుల నుంచి భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.