/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-02T150431.419-jpg.webp)
Krishna Mukunda Murari: ముకుంద మారిపోయిందని నమ్మిన ఆదర్శ్.. ఇన్నాళ్లు తనను వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ చెప్తాడు. ఇక నుంచి మనిద్దరం కలిసే ఉందామని మాటిస్తాడు ఆదర్శ్.
పెద్ద అత్తయ్య, ఇంట్లో వాళ్ళ కోసం ఆదర్శ్ రావడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికీ నేను మురారిని మర్చిపోలేక పోతున్నాను. కానీ ఆదర్శ్ రోజు రోజుకు నా పై ఆశలు పెంచుకుంటున్నాడు అని మనసులో టెన్షన్ పడుతుంది ముకుంద. ఏదో ఒకటి చేయాలనీ నిర్ణయించుకుంటుంది.
ముకుంద దగ్గరుండి కృష్ణ- మురారిలకు రింగ్స్ మార్పించడంతో సంతోషంగా ఫీల్ అవుతుంది కృష్ణ. ఇంతలో అక్కడి వచ్చిన మురారి.. ఏంటీ కృష్ణ అంత సంతోషంగా ఉన్నవని అడుగుతాడు. దీంతో కృష్ణ.. ముకుంద మీతో నా వేలికి ఉంగరం తొడిగించింది అంటే ముకుంద మారిపోయినట్లే కదా అని సంతోషిస్తారు. కానీ పెద్ద అత్తయ్యకు మాత్రం ముకుంద పై నమ్మకం రాలేదని అనుకుంటారు.
ఒంటరిగా ఉన్న భవాని దేవి... ముకుంద నిజంగా మారిపోయిందా..? లేదా ఆదర్శ్ రింగ్ తొడగడం ఇష్టం లేక తప్పించుకోవడానికి కృష్ణ- మురారిల చేత ఉండరాలు మార్పించిందా అని ఆలోచనలో పడుతుంది. రోజు రోజుకు ముకుంద పై అనుమానం పెరుగుతుంది కానీ తగ్గండం లేదని అనుకుంటుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన రేవతి కృష్ణ, మురారి, ఆదర్శ్, ముకుందల శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తానని భవాని దేవిని అడుగుతుంది. ముహూర్తం పెట్టిస్తే.. మళ్ళీ ముకుందకు ఆదర్శ్ ఇష్టం లేదని తెలిస్తే కొడుకు ఏమైపోతాడో అనే భయంతో శోభనం వద్దని చెప్తుంది భవాని.
అక్క ఎందుకు ఇలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది రేవతి. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ- మురారి ఏమైందని రేవతిని అడుగుతారు. భవాని అక్క శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తానంటే వద్దని చెప్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని బాధపడుతుంది రేవతి. దీంతో మనిద్దరం కలిసి వెళ్లి అడుగుదామని.. రేవతిని తీసుకొని భవాని దగ్గరకు వెళ్తుంది ముకుంద.
ఏంటీ కోడల్ని రాయబారం తీసుకొచ్చావా అని రేవతి పై కోప్పడుతుంది భవాని. కావాలంటే కృష్ణ మురారిలా శోభనం జరిపించు అని చెప్తుంది. దీంతో కృష్ణ వాళ్లకు జరిగినప్పుడే మాకు జరగాలని ఇన్ని రోజులు వాయిదా వేశాము కద అత్తయ్య అంటూ భావానిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ భవాని దేవి ఒప్పుకోదు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.