Brahmamudi Today Episode: అప్పలమ్మలా ఉంటావని భార్యను ఎగతాళి చేసిన రాజ్.. కొత్త అవతారంలో భర్తకు దిమ్మతిరిగే షాక్ విడాకులు ఎందుకు కావాలో చెప్పాలని భర్తను నిలదీస్తుంది కావ్య. నా భార్యకు ఉండాల్సిన హోదా నీకు లేదు.. ఎప్పుడు అప్పలమ్మలా రెడీ అవుతావని కోప్పడతాడు రాజ్. ఇటు అనామిక మరో సారి శోభనం క్యాన్సిల్ చేసే ప్లాన్ లో ఉంటుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 02 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Today Episode: మనం ఎప్పటికైనా విడిపోవాల్సిన వాళ్ళమే అని రాజ్ చెప్పడంతో.. నేను మీకు భార్యగా ఎందుకు తగనో కారణం చెప్పాలని భర్తను నిలదీస్తుంది కావ్య. దీంతో రాజ్.. నచ్చకపోవడానికి కారణాలు ఉండవు.. నువ్వు ఎప్పటికీ నా భార్యవు కాలేవు అంటూ కావ్య గుండెను ముక్కలు చేస్తాడు. భర్త దాటేసినప్పటికీ కావ్య మాత్రం ఈరోజు ఎలాగైనా నన్ను వదిలిపెట్టడానికి కారణం ఏంటో చెప్పాల్సిందే అని పట్టుపడుతుంది. ఒకటి కాదు వంద కారణాలు ఉన్నాయని బోర్డు పై రాస్తాడు రాజ్. ప్రతీ విషయంలో వాదిస్తావు , నీదే పై చేయిగా ఉండాలని చూస్తావు అంటూ భార్య పై మండిపడతాడు రాజ్. భార్య అంటే భర్త స్టేటస్ పెంచేలా ఉండాలి.. కానీ నువ్వు.. ఎప్పుడు అప్పలమ్మలా రెడీ అవుతావు.. ఎలాంటి చెప్పులు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు.. నీకు అసలు టేస్ట్ లేదని కోపంతో వెళ్ళిపోతాడు రాజ్. ఉదయాన్నీ రాజ్ కోసం కాఫీ తెచ్చిన కావ్య నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉంటుంది. ఇది చూసిన రాజ్ ఏంటీ ఈ కొత్త అవతారమని భార్యను అడుగుతాడు. ప్రతీ విషయంలో వాదిస్తానని చెప్పారు కదా.. అందుకే ఏం మాట్లాడకపోతే అసలు గొడవే రాదు కదా.. ఇప్పటి నుంచి మీరు మెచ్చేలా ఉంటానని భర్తతో చెప్తుంది. అది నీ తరం కాదులే అంటాడు రాజ్. దీంతో కావ్య నెల రోజుల్లో మీరే మెచ్చుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. Also Read: Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు హాల్లో అందరు కాఫీ తాగుతూ ఉంటారు. ఇదే సమయంలో అత్త అపర్ణ.. కావ్య ఆఫీస్ లో ఎలా పనిచేస్తుంది అని భర్త శుభాష్ ను అడుగుతుంది. దీనికి సుభాష్, ప్రకాశం ఇద్దరు.. కోడలు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి డిజైనర్స్ ఈ కాలంలో దొరకడం కష్టమని పొగడ్తల వర్షం కురిపిస్తారు. కోడలి గొప్పలు విన్న అత్త అపర్ణ సంతోషంలో తేలిపోపోతుంది. అక్కడే ఉండి ఇవ్వన్నీ వింటున్న చిన్నత్త ధాన్యలక్ష్మి.. అందరు కావ్యను పొగడడం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది. ఇంతలో భర్త ప్రకాశం ఎక్కడి వెళ్తున్నావని ఆమె పై సెటైర్ వేస్తాడు. దీంతో మీరు కాస్త నోరు మూసుకోండి అని భర్తకు వార్నింగ్ ఇస్తుంది. ఇది చూసిన ప్రకాశం తల్లి ఇందిరాదేవి అందరి ముందు భర్తను అవమానిస్తావా అని ధాన్యలక్ష్మిని తిడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్.. తన శోభన ముహూర్తం ప్రస్తావన తీసుకొస్తాడు. మీ శోభనం జరగాలంటే ఒక సంవత్సరమైన ఆగాల్సిందే అని అందరు కళ్యాణ్ ను ఆటపట్టిస్తారు. శోభనం ఇష్టం లేని అనామిక మరో సారి క్యాన్సిల్ చేసే ప్లాన్ లో ఉంటుంది. శోభనం ఎలా చెడగొట్టాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అడుగుతుంది. నీ భర్త నీ మాట వినడానికి ఇలా చేయాలనీ అనామిక అమ్మ.. సీక్రెట్ గా ఫోన్ లో సలహా ఇస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అసలు అనామిక తల్లి చెప్పిన ప్లాన్ ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Also Read: Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫస్ట్ టికెట్ రిలీజ్ చేసిన.. విజయ్ దేవరకొండ #brahmamudi-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి