Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావు సీఎం కావాలని చూస్తున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో కేసీఆర్, కేటీఆర్‌లకు వెన్నుపోటు పొడిచేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. హరీష్‌రావు కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే సీఎం అయ్యేందుకు మేం సపోర్ట్ చేస్తాం అన్ని అన్నారు.
Minister Komatireddy Venkat Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీల నడుమ వాడివేయగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు పై (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి . నిన్న (బుధవారం) కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Barrage) పనికి రాదు అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మీకు కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ మరమత్తులు చేయకరాకపోతే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన పదవికి రాజీనామా చేసిన తనకు సీఎం పదవి ఇవ్వాలని.. తాను సీఎం అయ్యి మేడిగడ్డ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) ను సరి చేస్తాం అని పేర్కొన్నారు.
తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy). హరీష్‌రావు వ్యాఖ్యలు కేసీఆర్ (KCR), కేటీఆర్‌కు (KTR) వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. హరీష్‌రావు సీఎం అయ్యే ప్లాన్‌లో ఉన్నట్టున్నాడని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తాం అని అన్నారు. కవిత (Kavitha), హరీష్, కేటీఆర్‌ల పేర్ల మీద BRS విడిపోతుందని జోస్యం చెప్పారు. BRSలో 4 పార్టీలు అవుతాయని అన్నారు.
హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని ఎద్దేవా చేశారు. హరీష్ రావు 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని హితవు పలికారు. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు.. ఆయన పులి ఎట్లా అవుతాడని ప్రశ్నించారు. 60 కిలోలు ఉన్న కేసీఆర్ పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలని చురకలు అంటించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర!

ALSO READ: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీలు
DO WATCH: