Raj Gopal Reddy: నన్ను ఎందుకు చేర్చుకున్నారు.. కాంగ్రెస్‌పై రాజ్‌గోపాల్ రెడ్డి సీరియస్!
చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. అలాంటి వాడిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని అన్నారు. ఒకవేళ అతన్ని చేర్చుకుంటే తనను ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు.
Komatireddy Raj Gopal Reddy: చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలమల కృష్ణారెడ్డి తనకు తెలియకుండా పార్టీలో చేరారని మండిపడ్డారు. తన మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తన వల్ల పార్టీకి లాభం అవుతుందనే తనను పార్టీలోకి పిలిచారని కాంగ్రెస్ హైకమాండ్ పై సీరియస్ అయ్యారు. తనను పార్టీలో చేరమని కాంగ్రెస్ పెద్దలు కోరితేనే పార్టీలో చేరినట్లు తెలిపారు. చలమల డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకున్నాడని విమర్శలు చేశారు. చలమల జాయినింగ్ చెల్లదని అన్నారు. చలమల వ్యక్తిత్వం లేని మనిషి..రాజకీయాలకు పనికి రాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు 10 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సొంత గూటికి చలమల కృష్ణా రెడ్డి చేరుకున్నారు. దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చలమల .. టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి.. టికెట్ దక్కకపోవడంతో బీఅర్ఎస్ లో చేరారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణా రెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు. త్వరలో పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.

ALSO READ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్ లో చేరిన కృష్ణా రెడ్డి..
సొంత గూటికి చలమల కృష్ణా రెడ్డి చేరుకున్నారు. దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చలమల .. టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి.. టికెట్ దక్కకపోవడంతో బీఅర్ఎస్ లో చేరారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణా రెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు. త్వరలో పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!