Kolkata Doctor Case : పాలిగ్రాఫ్ టెస్టు అంటే ఏంటీ.. ఎలా చేస్తారు ? కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ప్రత్యేక కోర్టు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ ఈ టెస్టుకు సిద్ధమవుతోంది. పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By B Aravind 23 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kolkata Trainee Doctor : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచర ఘటన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఆర్జీకార్ మెడికల్ కళాశాల (RG Kar Medical Colleges) మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో సహా అభయతో చివరిసారిగా ఉన్న మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) చేయాలని నిర్ణయించింది. గురువారం వీళ్లందరూ పాలిగ్రాఫ్ టెస్టుకు అంగీకరించారు. ఇప్పటికే సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోల్‌కతాలోని ప్రత్యేక కూడా వీళ్లకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ హత్యాచారం ఘటన జరిగిన అనంతరం సీబీఐ దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను, అభయతో చివరిసారిగా ఉన్న మరో నలుగురు డాక్టర్లను విచారిస్తోంది. అయితే సందీప్ ఘోష్ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. Also Read: డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి జ్యూడిషల్ కస్టడీ ఈ క్రమంలోనే ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ (Polygraph Test) చేయాలని నిర్ణయించింది. అలాగే ఆయనతో మరో నలుగురు డాక్టర్లకు కూడా ఈ టెస్ట్ నిర్వహించాలని భావించింది. ఈ క్రమంలోనే సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఇప్పటికే కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీళ్లకి పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. మరో విషయం ఏంటంటే వాస్తవానికి పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా అధికారులు సేకరించిన వివరాలను కోర్టులు అంగీకరించవు. కానీ ఈ కేసులో కీలక ఆధారాలను గుర్తించేందుకు ఈ టెస్టు ఉపయోగపడుతందనే కారణంతోనే సీబీఐ ఈ విధానాన్ని ఎంచుకుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటీ పాలిగ్రాఫ్ టెస్టును.. లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. దర్యాప్తు అధికారులు నిందితులు ప్రశ్నించేటప్పుడు వాళ్లు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధాలు చెబుతున్నారా అనేది ఈ పరీక్షలో గుర్తించవచ్చు. ఈ పరీక్షకు ఎలాంటి ఔషధాలు గానీ మత్తు మందులు గాని వినియోగించరు. కేవలం ఆ వ్యక్తి శరీరానికి కార్డియో - కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతో పాటు మరికొన్ని పరికారాలు అమర్చుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. అడిగే ప్రశ్నకు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో ఈ టెస్టు వల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అడిగిన ప్రశ్నకు అబద్ధం చెబితే అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. మరీ ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారిపోతుంది. దీంతోనే ఆ నిందితుడు చెప్పేది నిజమేనా ? కాదా ? అనేది అధికారులు గుర్తిస్తారు. అలాగే ఈ టెస్టులో నిందితుడు వాస్తవాలు దాచేందుకు కూడా ఆస్కారం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరీక్షను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ మొదటిసారిగా వినియోగించినట్లు తెలుస్తోంది. Also Read: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ #telugu-news #national-news #kolkata-trainee-doctor-case #polygraph మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి