BIG BREAKING : కోడికత్తి కేసులో శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ కోడికత్తి కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
BIG BREAKING : కోడికత్తి కేసులో శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

BREAKING : ఏపీ(AP) కోడికత్తి(Kodi Kathi) కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు(Janapalli Srinivasa Rao) కు ఏపీ హైకోర్టులో ఊరట కలిగించింది. శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని,ర్యాలీలు,సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

publive-image

ఐదేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు న్యాయ స్థానం రిలీఫ్ కల్పించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : Vijayawada: జనసేనలో గ్రూప్ వార్.. టికెట్ కోసం కుస్తీ

2018లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌(CM Jagan) పై అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయం(Visakha Airport) లో కోడి కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే దీన్ని న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు శ్రీనివాసరావు.

ఈ క్రమంలో దీనిపై కొద్దిరోజుల క్రితం విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం. బాధితుడు జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గిపోతున్నాడంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సుధీర్ఘకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవలే తీర్పు రిజర్వు చేయగా తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు