TDP: కోడికత్తి కేసు శ్రీనుని కలవడానికి వెళ్లిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు.. అడ్డుకున్న అధికారులు.!
విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తో ములాఖత్ అయ్యేందుకు వెళ్లారు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. అయితే, వారిని జైలు అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో జనుపల్లి శ్రీనివాస్ కు న్యాయం చేయాలంటూ జైలు బయట నిరసన చేపట్టారు.