Health Tips : రెస్టారెంట్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తినే అలవాటుందా ? జాగ్రత్త..

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో కనిపించే అజినమెటో అనే పదార్థం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపడం, మధుమేహం, థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

New Update
Health Tips : రెస్టారెంట్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తినే అలవాటుందా ? జాగ్రత్త..

Ajinomoto : చాలామంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు(Fast Food Centers), రెస్టారెంట్లలో(Restaurants) తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. బయటకు వెళ్లినప్పుడు అలా రోడ్డు పక్కన ఉన్న వాటిని  చూడగానే అలా ఓ పట్టుపడదామని అనుకుంటారు. మరికొందరైతే దీనికి అలవాటు పడిపోతారు. కానీ వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో కనిపించే పదార్థం అజినమెటో(Ajinomoto). మెనోసోడియం గ్లుటమేట్.. ఎమ్‌ఎస్‌జీగా పిలుచుకునే రసాయనం ఇది. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

Also Read : ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు.. ఈ అలవాట్లు పాటించండి

నరాలపై ప్రభావం

వాస్తవానికి అజినమెటోకు తలనొప్పి(Headache) కలిగించే లక్షణాలు ఉంటాయి. అదికూడా చిన్నపాటిది ఏం కాదు. తరుచూ తీవ్రంగా వేధించే మైగ్రేన్ లాంటి సమస్యకు ఇది దారి తీస్తుంది. అంతేకాదు హృదయ స్పందనను కూడా ఇది అస్తవ్యస్తం చేయగలదు. నాడి వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. దీనివల్ల నరాలు యాక్టివ్‌గా ఉండకపోవడం, ఒళ్లంతా మొద్దుబారినట్లు అనిపించడం, పొట్టలో మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మోతాదుకు మించి తీసుకుంటే అంతే సంగతులు

అలాగే మహిళల్లో సంతానోత్పత్తి(Fertility In Women) పై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. శిశువులు కూడా ఈ ఉత్పత్తులకు దూరంగా ఉండాలనే హెచ్చరికలు ఉన్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్య, ఊబకాయం.. వగైరా వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే ఇవ్వన్నీ ప్రాథమిక అంచనాలే అని అధ్యయనాలు చెబుతున్నాయి. మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం కచ్చితంగా చెడు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.

Also Read: ఈ పార్క్‌కి వెళ్తే మీరూ సముద్రపు దొంగల్లా మారిపోతారు

Advertisment
తాజా కథనాలు