Chhattisgarh : మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడి..!!

ఛత్తీస్‌గఢ్‌ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడ చేశారు గుర్తుతెలియని దుండగులు. ఖుజ్జిస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఓ బహిరంగకార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది.

New Update
Chhattisgarh : మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడి..!!

Knife attack on woman MLA : ఛత్తీస్‌గఢ్‌ లో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితోదాడిచేశారు గుర్తు తెలియనిదుండగులు. ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ సందు సాహు ఆదివారం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఓ బహిరంగకార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం...ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో ఓ వ్యక్తి ఎమ్మెల్యేపూ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటలో ఆ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. ఈదాడికి పాల్పడిన నిందితుడు ఖిలేశ్వర్ గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల్లోని ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు ఆదివారం జోధారా గ్రామంలో ఓ కార్యక్రమానకి హాజరవుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం సాహు వేదికపై మాట్లాడుతుండగా మద్యంమత్తులో ఉన్న వ్యక్తి ఆమెపై కత్తితో దాడిచేశాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. సాహు మణికట్టుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

ఈఘటనను ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఛత్తీస్ గఢ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించింది. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేకే భద్రత లేనప్పుడు సామాన్యులు పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఇది భూపేశ్ బఘేల్ ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు