Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి కిషన్‌రెడ్డి కంప్లైంట్‌.!

తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని లేఖ రాశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

New Update
Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కంప్లైంట్‌ చేశారు. నియోజకవర్గాల్లో వందలమంది బీఆర్‌ఎస్‌ నేతలు గుమిగూడుతున్నారని లేఖ రాశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌కు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

కాగా, తెలంగాణలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వాగ్వాదాలు, గొడవలు జరిగుతున్నాయి. నాగర్‌ కర్నూలు జిల్లా మన్ననూర్‌ పోలింగ్‌ కేంద్రం దగ్గర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడువ పడుతున్న ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. గద్వాల జిల్లా ఐజా ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నా పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు.

Also Read: పంతం నెగ్గించుకున్న ఏపీ..నాగార్జునసాగర్‌లో నీటి విడుదల.!

అలాగే జనగామ జిల్లా 245వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళను చెదరగొట్టారు. ఇక నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో విజయమేరి పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గొడవపడ్డారు. అక్కడితో ఆగకుండా కొట్లాటకు దిగబోతుంటే పోలీసులు లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు.

Advertisment
తాజా కథనాలు