TS News : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!

హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. బీజేపీకి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

New Update
TS News : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!

Hyderabad : ఈసారి కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే ఆరోపణలపై బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. అలాంటి ఉద్దేశం బీజేపీకి లేదని, అలాగే బీఆర్ఎస్ తో దోస్తీ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు.

అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే..
ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కానీ వాళ్ల అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదని, దానికి తమ ప్రభుత్వం బాధ్యకాదన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: CM Reanth: ఆదిలాబాద్ అంటే అభిమానం.. పూర్తి బాధ్యత నాదే: సీఎం రేవంత్

బీజేపీ చెప్పేది చేస్తుంది.. చేసేది చెబుతుందన్నారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదని, అందుకే అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. మణిపూర్ ఇష్యూ చాలా సెన్సిటివ్. ప్రాణనష్టం ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీనే 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చింది. ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుదంటూ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు