ఆ రోజు ఎంతో దూరంలో లేదు.... హైదరాబాద్ పై ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్...!
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.