khalistan : భారత ప్రభుత్వానికి కెనడా పీఎం ఝలక్..దౌత్యవేత్త బహిష్కరణ..!!

ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్‌కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

khalistan : భారత ప్రభుత్వానికి కెనడా పీఎం ఝలక్..దౌత్యవేత్త బహిష్కరణ..!!
New Update

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వ్యవహారం మరింత వేడెక్కుతోంది. కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను తొలగించేసింది. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరిస్తున్నట్లు ప్రముఖ వార్త సంస్థ వెల్లడించింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉండొచ్చన్న ఆరోపణుల చేసింది కెనడా. కెనడా ప్రభుత్వం సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు.

ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో జి-20 సదస్సులో చీవాట్లు తిన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. భారత ప్రభుత్వానికి, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య ఉన్న సంబంధాలపై కెనడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో పీఎం ట్రూడో చెప్పారు. కెనడా పౌరుడిని సొంత గడ్డపై హత్య చేయడంలో మరే ఇతర దేశం లేదా విదేశీ ప్రభుత్వ ప్రమేయాన్ని సహించబోమని ట్రూడో చెప్పారు. ట్రూడో ప్రకటనతో భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత బలహీనపడేలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: నీళ్లు తక్కువగా తాగుతే ఏమౌతుందో తెలుసా..!!

నిజ్జర్ హత్యను ట్రూడో తన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించాడని ట్రూడో అన్నారు. అతని ప్రకటనతో పాటు, కెనడా కూడా ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జాలీ, దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ, తమ దేశం తన పౌరులను అన్ని ఖర్చులతో కాపాడుతుందని చెప్పారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఎన్‌ఐఏ పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని గురుద్వారా పార్కింగ్‌లో నిల్చున్న ఉగ్రవాది నిజ్జర్‌ను కాల్చి చంపారు.

జి-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో కూడా ఈ అంశం గురించి ప్రస్తావించినట్లు జస్టిన్ ట్రూడో చెప్పారు. తాను ఢిల్లీ పర్యటనలో భారత ప్రభుత్వానికి ఈ అంశాన్ని లేవనెత్తానని కూడా పేర్కొన్నారు. కెనడా పార్లమెంట్‌లో ట్రూడో మాట్లాడుతూ, 'గత కొన్ని వారాలుగా, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్, భారత ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలపై విశ్వసనీయమైన ఆరోపణలపై కెనడా భద్రతా సంస్థలు చురుకుగా దర్యాప్తు చేస్తున్నాయి. కెనడా చట్టాన్ని గౌరవించే దేశం. కెనడియన్లందరి భద్రతను మా భద్రతా ఏజెన్సీలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు నిర్ధారించడం మా మొదటి ప్రాధాన్యత అని ట్రూడో అన్నారు.

ఇది కూడా చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు.. సూసైడ్..!!

ఈ హత్యకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ట్రూడో తెలిపారు. కెనడా ఈ విషయాన్ని భారత ప్రభుత్వ ఉన్నత అధికారులు, భద్రతా అధికారులతో లేవనెత్తింది. మన స్వంత గడ్డపై ఎవరైనా కెనడియన్ పౌరుడిని హత్య చేయడంలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే. ఈ చాలా తీవ్రమైన విషయంపై మేము మా భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము. ఈ విషయంలో కెనడాకు సహకరించాలని నేను భారత ప్రభుత్వాన్ని గట్టిగా అభ్యర్థిస్తున్నాను అని పేర్కొన్నారు.

భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ ను జూన్ 18న కెనడాలో గుర్తుతెలియన దుండగులు హత్య చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. పంజాబ్ లోని జలంధర్ లోని భర్సింగ్ పూర్ గ్రామానికి చెందిన హర్దీప్. ఖలీస్తాన్ నాయకుడన పరారీలో ఉన్న వ్యక్తి గా ఎన్ఐఏ ప్రకటించింది. 2022లో పంజాబ్ లోని జలంధర్ లో హిందూ పూజారిని హత్య చేసిన కేసు నమోదు చేయడంతో పాటు హర్దీప్ సింగ్ ను పట్టించిన వారికి రూ. 10లక్షల రివార్డును కూడా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: నేడే నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశం..పూర్తి షెడ్యూల్ ఇదే..!!

#canada #hardeep-singh-nijjar #justin-trudeau #khalistan #indian-diplomat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe