Karnataka : హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు..

కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో నిందితులుగా ఉన్న హెచ్‌డీ రేవణ్ణ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. సెక్స్ టేప్ బాధితుల్లో ఒకరి కుమారుడు...తన తల్లిని కిడ్నాప్ చేశాంటూ రేవణ్ణపై కంప్లైంట్ చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది.

New Update
Karnataka : హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు..

Karnataka Sex Scandal : కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం సెక్స్ స్కాండల్. జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna), అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలు చాలా మంది మహిళల మీద లైంగిక దాడులు చేయడమే కాక వాటిని వీడియోలు తీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 3వేల వీడియోలు దొరికాయని చెబుతున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. లైగింక ఆరోపణలు రాగానే ప్రజ్వల్ జర్మనీ పారిపోయాడు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం అతని మీద లుక్‌ అవుట్ నోటీసు కూడా జారీ చేసింది.

ఈ కేసులో మరో రిందితుగు హెచ్డీ రేవణ్ణ(HD Revanna). ఇతను కూడా జేడీ(ఎస్) నేత. ఒకప్పుడు మంత్రిగా కూడా పని చేశారు. హెచ్‌డీ రేవణ్ణ మీద అతని ఇంట్లో పని చేసిన బంధువుల మహిళే కంప్లైంట్ చేశారు. అతను తన మీద చాలాసార్లు లైంగిక దాడులకు(Sexual Scandal) పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తాజాగా మరో బాధితురాలి కొడుకు తన తల్లి కనిపించడం లేదంటూ కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు(Kidnap Case) నమోదైంది. దీంతో హెచ్డీ రేవణ్ణ మీద ఇప్పుడు కిడ్నాప్ కేసు కూడా నమోదయింది.

ఫిర్యాదు చేసిన బాలుడు తల్లి ఆరు ఏళ్ళు రేవణ్ణ ఇంట్లో పని చేసింది. మూడేళ్ళ క్రితం అక్కడ పని మానేసి కూలిగీ చేరింది. అయితే ఇప్పుడు ఎన్నికలకు మూడు రోజుల ముందు సతీష్ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ పిలుస్తారని తీసుకెళ్ళాడని చెప్పారు. ఏప్రిల్ 29న సతీష్ తన తల్లిపై పోలీసు కేసు పెడతామని..హెచ్డీ రేవణ్ణ పిలుస్తున్నారని తన తల్లిని బైక్‌ మీద ఎక్కించుకుని వెళ్ళాడు. అలా వెళ్ళిన తన తల్లి ఇప్పటి వరకు రాలేదని పిల్లాడు రాజు చెప్పాడు. తల్లిని విడిచిపెట్టమని సతీష్‌ బాబును కోరినప్పటికీ ఫలితం లేకుండ ఆపోయిందని చెప్పాడు. తన తల్లికి ప్రాణ హాని ఉందని..రేవణ్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. సెక్స్ టేప్‌లో తన తల్లి ఉండడం..ప్రజ్వల్ రేవణ్న ఆమెను బుతూలు తిట్టడం తన స్నేహితులు, బంధువులు అందరూ చూశారని చెప్పుకొచ్చాడు రాజు.

Also Read:West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు