International: తోకతో పుట్టిన చిన్నారి..చైనాలో వింత జననం! కోతి నుంచి మనిషి వచ్చాడనేది సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. క్రమంగా దశలు మార్చుకుని కోతి మనిషిగా మారాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే దశకు వెళ్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 22 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి డార్విన్ సిద్ధాంతం అందరికీ తెలిసిందే. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ళ క్రితం కోతి నుంచి మనిషి వచ్చాడు అన్నది ఈ సిద్ధాంతం. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టే ఎక్కుకుంటూ..నెమ్మదిగా మనిషిలా మారాడు. మొదట్లో మనుషులు కోతులులాగే తోకలతో ఉండేవారు. అడవిలో జంతువుల్లా మసలేవారు. కానీ నాగరికతను అలవాటు చేసుకుంటూ తమలో మార్పులు తెచ్చుకున్నారు. క్రమంగా వారికున్న తోక కూడా పోయింది. ఇది గతం. ఇప్పుడు మనిషి పూర్తిగా ఆధునిక జీవి. టోక్సాలజీతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న తెలివైన జాతి మనది. అయితే ఇలాంటి కాలంలో కూడా మనిషి పుట్టుకలో విచిత్రాలు జరుగుతున్నాయి. అలాంటివి చూస్తున్నప్పుడే మనం మళ్ళీ వెనక్కు వెళుతున్నామా అని అనిపించకమానదు. చైనాలో పుట్టిన ఓ బేబీని చూసి అక్కడి డాక్టర్లు ఇలానే ఆశ్చర్యపోయారు. చైనాలో ఓ ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు చాల ఆరోగ్యంగా ఉన్న బేబీని బయటకు తీశారు. కానీ తీరా తీసిన తర్వాత చూసి మాత్రం షాక్‌కు గురయ్యారు. దానికి కారణం బిడ్డకు తో ఉండడమే. అది కూడా అచ్చు జంతువులకు ఉన్నట్టు వెనకాలనే ఉంది కూడా. చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో జరిగిందీ ఈ ఘటన. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. The Truth Behind The Baby Born With Four Inch Long Tail In China https://t.co/VDG694XvcJ pic.twitter.com/eR4PP88clJ — Hira Mokariya (@MokariyaHira) March 15, 2024 అయితే ఇది కేవలం బాడీ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లనే వచ్చిందని చెబుతున్నారు డాక్టర్లు. వెన్నుముక చుట్టూ ఉన్న కణజాలాలతో ఆ తోక అనుసంధానం అయి ఉందని గుర్తించారు. అయితే తోక సాధారణంగా వెన్నెముక అడుగుభాగంలో ఉంటుందని పేర్కొన్నారు. మృదువుగా ఉండి ఎముకలు లేకుండా ఉన్న ఆ తోక సుమారు 10 సెంటీ మీటర్లు అంటే 3.9 అంగుళాల పొడవు ఉందని తెలిపారు. పైగా ఈ తోక శిశువు నాడీ వ్యవస్థతో కనెక్ట్ అయ కూడా ఉంది.దానివలన బేబీకి తోకను తొలగించడానికి వీలులేదని కూడా అంటున్నారు. ఇంతకు ముందు కూడా దక్షిణ అమెరికాలో ఇలానే తోకతో ఉన్న మగపిల్లవాడు పుట్టాడని..కానీ అతనికి తోకను డాక్టర్లు విజయవంతంగా తీయగలిగారని చెబుతున్నారు. Also Read:Gold Price Hike: వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే.. #china #baby #tail #new-born మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి