ఉడాన్ పథకం ఉత్తదే... ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు....!

దేశంలోని 93 శాతం రూట్లలో ఈ పథకం పని చేయాలని ఆయన ఆరోపించారు. కాగ్ ఆడిట్ నివేదికను జత చేస్తూ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ పథకంలో పారదర్శకత లోపించిందన్నారు. ఇందులో ఎయిర్ లైన్స్ స్వతంత్ర ఆడిట్ కూడా చేయలేదని చెప్పారు.స్లిప్పుర్లు వేసుకున్న పేద వాళ్లకు సైతం విమానంలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని కేంద్రం తెలిపిందన్నారు.

author-image
By G Ramu
ఉడాన్ పథకం ఉత్తదే... ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు....!
New Update

కేంద్రం తీసుకు వచ్చిన ‘ఉడాన్’పథకంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. దేశంలోని 93 శాతం రూట్లలో ఈ పథకం పని చేయాలని ఆయన ఆరోపించారు. కాగ్ ఆడిట్ నివేదికను జత చేస్తూ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. స్లిప్పుర్లు వేసుకున్న పేద వాళ్లకు సైతం విమానంలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని కేంద్రం తెలిపిందన్నారు.

కానీ ఎప్పటిలాగే కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు మళ్లీ గాల్లో కలిసిపోయాయన్నారు. ఈ మాటలు తాము చెబుతున్నవి కాదని, కాగ్ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించిందన్నారు. ఈ పథకంలో పారదర్శకత లోపించిందన్నారు. ఇందులో ఎయిర్ లైన్స్ స్వతంత్ర ఆడిట్ కూడా చేయలేదని చెప్పారు. ఈ పథకంలో అధిక ప్రాచుర్యం పొందిన హెలికాప్టర్ సేవలు కూడా నిలిచి పోయాయన్నారు.

సామాన్యుడికి ఉడాన్ అందలేదన్నారు. కేవలం అబద్దాలు, జుమ్లాలు మాత్రమే మిగిలాయని ఫైర్ అయ్యారు. అలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలు క్షమించబోరని ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఉడాన్ పథకం గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. హవాయి చెప్పులు ధరించిన పేదవాడు సైతం విమానంలో ప్రయాణించాలనేదే తన కల అన్నారు.

ఉడాన్ అనేది ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన పథకం. దీన్ని 2016లో కేంద్రం ప్రారంభించింది. దీనిపై ఇటీవల కాగ్ తన ఆడిట్ నివేదికను వెల్లడించింది. అందులో 371 రూట్లలో ప్రారంభించగా అందులో కేవలం 30 శాతం (112 రూట్లలో) మూడేండ్ల పూర్థి స్థాయి తగ్గింపును పూర్తి చేసుకున్నాయని పేర్కొంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ మంజూరు చేసిన బడ్జెట్ నుంచి ఆర్ సీఎస్ విమానాశ్రయాల అభివృద్ధి లేదా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరిగిందని వెల్లడించింది.

#modi #mallikarjun-kharge #bjp #airlines #udaan #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe