Telangana : ఖమ్మం(Khammam) రాజకీయాల్లో(Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) బీజేపీలో(BJP) చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తెలంగాణ(Telangana) బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ నెల 22 న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుందని సమాచారం.
తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ(BJP) ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది. అవే ఖమ్మం, వరంగల్. ఇప్పటికే ఆరూరి రమేశ్ కు వరంగల్ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం గురించి ఎటూ తేల్చుకోలేని స్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం స్థానాన్ని టీడీపీ కి ఇచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చర్చంతా నడుస్తుండగానే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ఖమ్మం టికెట్ ఆశించిన బీఆర్‌ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ గూటికి చేరారు. పార్టీ మార్పు గురించి నామా మాత్రం నోరు విప్పలేదు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ టీడీపీ పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా మిగిలిన బీజేపీ సీనియర్ నేతలు..టీడీపీ తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదని.. పూర్తిగా తెలంగాణలో మేమే పోటీ చేస్తామనే పరిస్థితి కనిపిస్తోంది.
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతున్న క్రమంలో బీజేపీ నేతలు నామాకి టచ్ లోకి వచ్చారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నామా నాగేశ్వరరావు పేరును ప్రకటించినప్పటికీ ... నామా మాత్రం అక్కడ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే పార్టీ మారే అంశాన్ని మాత్రం నామా ఇంతవరకు ఖండించలేదు. నామాతో టచ్ లో ఉన్నట్లు అటు బీజేపీ వారు కూడా చెప్పలేదు.
Also Read : జక్కన్న కు తప్పిన పెను ప్రమాదం!