ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. ఉదయం 9.30కు తొలిపూజను అందుకోనున్నాడు. దీనిలో గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొంటారు. ఈసారి 63 అడుగుల దశమహా విద్యాగణపతి విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 11 రోజుల పాటూ గణేశుడికి ఉత్సవాలు జరగనున్నాయి.
పూర్తిగా చదవండి..మొదటిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు
హైదరాబాద్ లో హడావుడి మొదలైంది. మొదటి పూజ అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. ఈ సారి ఇక్కడ వినాయకుడు 63 అడుగుల ఎత్తులో శ్రీదశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Translate this News: