మొదటిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు

New Update
Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. ఉదయం 9.30కు తొలిపూజను అందుకోనున్నాడు. దీనిలో గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొంటారు. ఈసారి 63 అడుగుల దశమహా విద్యాగణపతి విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 11 రోజుల పాటూ గణేశుడికి ఉత్సవాలు జరగనున్నాయి.

మరోవైపు ఖైరతాబాద్ గణపతి రికార్డ్ సృష్టించాడు. 63 అడుగుల ఎత్తు గల మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పాడు. ఇప్పటికే మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే వ్యక్తి స్థానిక ఆలయంలో ఒక అడుగు గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేశారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

ఈసారి గణేశుడు విద్యాగణపతిగా దర్శనమిస్తున్నాడు. తలపై ఏడు సర్పాలు, వెనుక భాగంలో సంస్కృతి వచనం కనిపిస్తాయి. పది చేతులు ఉన్నాయి. కుడి చేతుల్లో ఆశీర్వాదం, దండ, ధాన్యం, కత్తి, బాణం ఉండగా...ఎడమచేతుల్లో లడ్డూ, పుస్తకం, తాడు, బాణం ఉన్నాయి. పాదాల దగ్గర పది అడుగుల ఎత్తులో వరాహదేవి, సరస్వతీదేవి విగ్రహాలున్నాయి. ప్రధాన మండపానికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలున్నాయి. మొత్తం అన్ని విగ్రహాలు మట్టితోనే తయారు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని 150 మంది కళాకారులు 100 రోజుల పాటూ పనిచేశారు. విగ్రహం తయారీకి మొత్తం 90 లక్షలు ఖర్చయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు