Crime : తణుకులో భారీ దొంగతనం...కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు

తణుకులో భారీ దొంగతనం జరిగింది. బంగారం వ్యాపారి ఙంటి నుంచి 5 గురు దొంగలు కేజీ బంగారం, నగదును దోచుకెళ్ళారు.

New Update
Crime : తణుకులో భారీ దొంగతనం...కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు

Tanuku Robbery: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది. నాందేవ్ అనే బంగారం వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి భారీ ఎత్తున దొంగతనం చేశారు. మొత్తం 5గురు దొంగలు ఇందులో పాల్గొన్నారని తెలుస్తోంది. నాందేవ్ షాపులో పనిచేసే సూరజ్ కుంబార్ అనే వ్యక్తే ఈ దొంగతనానికి పథక రచన చేసిన్టలు పోలీసులు గుర్తించారు. కారులో వచ్చిన దొంగలు ముందుగా నాందేవ్ ఇంట్లోకి చొరబడ్డారు. తరువాత ఇంట్లోనే ఉన్న వ్యాపారి భార్య సవిత, కుమారుడిని బంధించి కేజీ బంగారం, లక్ష నగదును దోచుకెళ్ళారు.

ఐదుగురు సభ్యుల దొంగల ముఠా అర్థరాత్రి వేళ వ్యాపారి ఇంట్లోకి చొరబడడమే కాక ఇంట్లో వారిని కత్తులతో బెదిరించి, కొట్టారని కూడా తెలుస్తోంది. బాధిత వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ దుకాణంలో పనిచేసే సూరజ్ అనే యువకుడు మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడినట్టు బాధిత వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సూరజ్ కుంబార్ మహారాష్ట్ర కు చెందినవాడు. ప్రస్తుతం దొంగలు పరారీలో ఉన్నారు.

Also Read: కంచరపాలెంలో విషాదం..చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి

Advertisment
తాజా కథనాలు